Bandi sanjay fires on cm kcr తెరాస ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని వెల్లడించారు. మొదటి సంగ్రామ యాత్ర విజయవంతమైందన్న బండి... రెండో సంగ్రామయాత్రకు విశేష స్పందన వచ్చిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ సభ పెట్టి.. చప్పట్లు కొట్టి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అనుకున్నదేమీ నెరవేరలేదు.. అందుకే తమపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. భాజపా కార్యకర్తలపై రాళ్లు వేస్తున్నా.. ఎక్కడా భయపడలేదని హెచ్చరించారు. భాజపా మహిళా కార్యకర్తలపై.. అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు చేశారు.
''తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా?. మేం ప్రజల్లో తిరుగుతున్నాం.. అందుకే మాకు ప్రజల మద్దతు ఉంది. పోలీసుల అనుమతితోనే ప్రజా సంగ్రామ యాత్ర చేసుకుంటున్నాం. 21 రోజుల తర్వాత నన్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? కేసీఆర్ కుటుంబానికి రూ.వేల కోట్లు ఎక్కణ్నుంచి వచ్చాయి. దిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. తెరాస నాయకుల భాష విని.. మా కార్యకర్తలు బాధపడుతున్నారు. కేవలం కుమార్తె కోసమే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారు.'' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్‌కు ధైర్యం ఉంటే కవితను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు బండి సంజయ్. సామాన్య కార్యకర్తకు ఒక న్యాయం..కవితకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే భాజపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కుటిల ప్రయత్నాలు చేసి..యాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా...రాష్ట్రాభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
''ప్రజాసంగ్రామ యాత్ర..పక్కాగా చేస్తాం..ఎవరూ ఆపలేరు. కేసీఆర్ లిక్కర్ స్కామ్‌పై స్పందించాలి. తెరాస ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజా సంగ్రామయాత్ర చూసి తెరాస ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొనాలి. కార్యకర్తలు ఎవరూ కేసులకు భయపడవద్దు..అండగా ఉంటాం. ఆరోపణలు వస్తే..నిరూపించుకోవాల్సిన బాధ్యత లేదా?'' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
దిల్లీ నుంచి వచ్చిన పక్కా సమాచారంతోనే మాట్లాడుతున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడితే పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారని తెలిపారు. భాజపా కార్యకర్తలే తమ బలం..అందుకే ఎవరికీ భయపడమని హెచ్చరించారు.
ఎట్టిపరిస్థితుల్లో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర అపే ప్రసక్తే లేదని పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు. సంగ్రామయాత్ర నిలిపివేయాలని పోలీసుల నోటీసులపై పార్టీ నేతలు స్పందించారు.
''పోలీసుల అనుమతితోనే గత 3విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నాం. అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు? ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగించి తీరుతాం. అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాలచెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తాం'' - భాజపా నేతలు
ఇదీ చూడండి: రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం