bandi sanjay fires on cm: కేసీఆర్ పాలనలో సరిగా విధులు నిర్వహించలేకపోతున్నామని పోలీసులు బాధపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం తన పాలన గురించి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. హైదరాబాద్లోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రసిద్ధిగాంచిన కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.
"రాష్ట్రంలో సీఎం.. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు. దీంతో పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. కర్మన్‌ఘాట్ ఘటనలో గోరక్షకులపై పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలి. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి." -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
గతంలో కర్మన్‌ఘాట్ ఘటనలో గోరక్షకులపై పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Bandi Sanjay on Budget: 'సస్పెన్షన్ను నిరసిస్తూ రేపటి నుంచి ఆందోళనలు'