ETV Bharat / state

ప్రధాని నిర్ణయం చారిత్రాత్మకమైనది: బండి సంజయ్​ - దేశ ప్రజలందరికీ ఉచిత టీకా నిర్ణయంపై బండి సంజయ్​ హర్షం

దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు.

bandi
bandi sanjay
author img

By

Published : Jun 7, 2021, 10:54 PM IST

రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా కేంద్రమే వ్యాక్సిన్ కొనుగోలు చేసి పేద, మధ్య, ఉన్నత వర్గాల ప్రజలకు ఉచితంగా అందించాలని ప్రధాని నిర్ణయం గొప్ప విషయమని బండి సంజయ్​ అన్నారు. ఇది దేశహితం కోసం ప్రధాని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని బండి సంజయ్‌ కొనియాడారు.

కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వ మొట్టమొదటి ప్రాధాన్యతని ప్రధాని ప్రకటించారన్నారు. ప్రధాని నిర్ణయంతో దేశం కరోనా ఫ్రీ భారత్‌గా మారడం ఖాయమని అభిప్రాయపడ్డారు. పేదలకు తలా 5కిలోల బియ్యం పంపిణీ కొనసాగిస్తామని ప్రకటించినందుకు ప్రధానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,933 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.