ETV Bharat / state

బాధితులకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి: బండి సంజయ్ - హైదరబాద్‌లో బండి సంజయ్ లేటెస్ట్ కామెంట్స్

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. వరద బాధితుల్ని ఆదుకోవాలని... ఇళ్లు కూలిన వారికి రూ.20లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

bandi sanjay demanded rs 20 lakh Compensation from telangana government
బాధితులకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి: బండి సంజయ్
author img

By

Published : Oct 15, 2020, 6:49 AM IST

ఎడతెరిపిలేని వర్షాలు, వరదలతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. మరో రెండు రోజులు వర్షాలు పడనున్నందున ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని... ఇళ్లు కూలిపోయిన బాధితులకు 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు చేసినా... ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

వరద గుప్పిట చిక్కుకున్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపకపోవడమే ముంపునకు కారణమని దుయ్యబట్టారు. భాజపా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు స్థానిక పరిస్థితుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయ చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి: జలాశయాలకు జలకళ.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.