భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి క్రియాశీల పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఒక మంచి నాయకుడిని కోల్పోవడం భారత జాతికి తీరని లోటన్నారు. తెలంగాణ ఏర్పడిన చారిత్రక సందర్భంలో తనదైన పాత్ర పోషించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో పాల్గొన్న ఏకైక వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. భారతదేశానికి రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని.. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు బండి సంజయ్ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం