ETV Bharat / state

Bandi Sanjay: 'ప్రజల్లో సెంటిమెంట్​ను రెచ్చగొట్టేందుకు తెరాస ప్రయత్నిస్తోంది' - తెరాస నిరసనలు

Bandi Sanjay Comments on TRS Protests: తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ప్రధానమంత్రి మోదీ స్పష్టంగా చెప్పినా... ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు తెరాస యత్నిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. దిల్లీలో పార్టీ నేతలతో కలిసి ఆయన తెలంగాణ అమరులకు నివాళులర్పించారు.

Bandi Sanjay
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
author img

By

Published : Feb 9, 2022, 12:21 PM IST

Bandi Sanjay Comments on TRS Protests: ప్రజల దృష్టి మరల్చేందుకే తెరాస శ్రేణుల నిరసనలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను విమర్శిస్తే తెరాసకు అభ్యంతరమెందుకంటూ ప్రశ్నించారు. దిల్లీలో భాజపా నేతలతో కలిసి ఆయన తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆయా రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్‌ అనుసరించిన విధానాన్ని మోదీ విమర్శించారని బండి తెలిపారు. అయినా కాంగ్రెస్​ను ప్రధాని విమర్శిస్తే.. తెరాసకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. అందుకే ఇవాళ తెలంగాణలో ఆ పార్టీకి ఆదరణ పోయిందని చెప్పారు. 1999లో ఎన్డీఏలోని పార్టీలు అడ్డుపడటం వల్ల తెలంగాణ ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని... పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రే కొట్టడం తప్పని మోదీ అన్నారని బండి సంజయ్​ పేర్కొన్నారు.

తెరాస నిరసనలపై బండి సంజయ్‌ కామెంట్స్

'ప్రజల దృష్టి మరల్చేందుకే తెరాస శ్రేణుల నిరసనలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పుడు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? తెలంగాణ వద్దన్న ద్రోహులనే ఇవాళ కేసీఆర్‌ చేరదీశారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబం ఏమైనా చేసిందా? కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్‌ ఏం చేస్తున్నారు? ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.'

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

కల్వకుంట్ల రాజ్యాంగం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్​ను రెచ్చగొట్టి.. మళ్లీ లబ్ధిపొందాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: TRS MPs on Modi: 'తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.