ETV Bharat / state

సీబీఐ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు: బండి సంజయ్​ - టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తాజా

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విషయంలో కేసీఆర్‌ తప్పు చేయనప్పుడు.. సీబీఐ విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. భాజపా పిటిషన్ వేసేంతవరకు.. సీబీఐ ఉపసంహరణ అంశం బయటకి రాలేదన్నారు.

Bandi sanjay comments on CM KCR
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
author img

By

Published : Oct 30, 2022, 4:00 PM IST

ఎమ్మెల్యేల ఎర కేసు విషయంలో కేసీఆర్‌ తప్పు చేయనప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయడానికి భయపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మర్రిగూడెంలో బండి సంజయ్‌ మాట్లాడారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలో సీబీఐ విచారణను నిలిపివేస్తూ ఇచ్చిన జీవోను 24 గంటల్లోగా ప్రజలకు తెలియజేయాలని.. కానీ నిన్న కోర్టులో సమాధానం చెప్పే వరకు బయట ప్రపంచానికి తెలియలేదని బండి మండిపడ్డారు. భాజపా పిటిషన్‌ వేసేంత వరకు ఈ సీబీఐ ఉపసంహరణ విషయం బయటకు రాలేదని ఆరోపించారు. తప్పు చేశారు కాబట్టే యాదాద్రికి ముఖ్యమంత్రి రావడం లేదని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు ఎందుకు సీబీఐ విచారణకు అడ్డుపడుతున్నారని నిలదీశారు.

మునుగోడులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సీబీఐ విచారణను తెలంగాణలో నిలిపివేస్తూ ఇచ్చిన జీవోను 30/08/2022న జారీ చేశారు. అది ఎందుకంటే కేసీఆర్‌ బిడ్డ లిక్కర్‌ వ్యవహారంలో ఇరుక్కున్న సమయంలో రద్దు చేయడం జరిగింది. ఈ జీవోను అమలు చేసినప్పుడు 24 గంటల్లోపు ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు ఈ కేసు విషయంలో కోర్టులో తెలిపారు. అప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకు సీబీఐ అంటే భయం. నిన్న భాజపా మీద ఆరోపణలు చేశావు. మేము తప్పు చేయలేదు. అందుకే యాదాద్రికి రమ్మన్నాము. రాలేదు. నీ పోలీసుల ద్వారా విచారణ చేయమన్నా చేయలేదు. సిట్టింగ్‌ జడ్జి ద్వారా విచారణ జరపమన్నాము. చేయించడం లేదు. సీబీఐ విచారణ జరపమన్నా.. దానికీ ఒప్పుకోలేదు. -బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఎమ్మెల్యేలను చేర్చుకునే క్రమంలో భాజపా పద్ధతిగా వ్యవహరిస్తోందని సంజయ్‌ అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెరాస 36 మందిని పార్టీలోకి చేర్చుకుందన్నారు. ఆగస్టులో విడుదల చేసిన సీబీఐ రద్దు జీవోను ఎందుకు గోప్యంగా ఉంచారని సీఎంను ప్రశ్నించారు. భాజపా మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరే వేగంగా విచారణ జరిపించాలి కదా.. కానీ ఎందుకు భయపడుతున్నారు అని బండి ప్రశ్నించారు. ఏ వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే ఎలా అని సీఎంను అడిగారు.

విచారణ నిష్పక్షపాతంగా జరపమని కోర్టులో పిటిషన్‌ వేసింది మేమే.. దీనికి కౌంటర్‌ వేస్తున్నావు విచారణ జరవద్దని. విచారణ జరపకుంటే నిజం ఎట్ల బయటకు వస్తుంది. నీవు తప్పు చేయనప్పుడు ఈ విచారణను ఎందుకు జరపొద్దు అంటున్నావు. ఆరోపణలు చేసినప్పుడు విచారణ జరపాలి కదా. మరి ఏ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఎలా. నిజాలు ఎలా బయటకు వస్తాయి. మొదట నీ మీద నీకే నమ్మకం లేదు. ఏ విచారణకు నీవు సిద్ధంగా లేకపోతే ప్రజలకు ఎట్లా నిజం తెలియాలి. మా మీద విచారణను చేసినప్పుడు నీవే బయటకు రావాలి మొదట.. ఈరోజు మునుగోడు సభలో ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకువస్తావు. - బండి సంజయ్‌, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.