ETV Bharat / state

Alai-Balai 2021: 'తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలయ్‌-బలయ్‌'

కులమతాలకు అతీతంగా, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా అలయ్‌-బలయ్‌(Alai-Balai 2021) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బండారు విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్ జలవిహార్​లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు.

Alai-Balai 2021, bandaru vijaya about alai balai 2021
అలయ్ బలయ్ 2021, హైదరాబాద్​లో అలయ్ బలయ్
author img

By

Published : Oct 17, 2021, 9:50 AM IST

Updated : Oct 17, 2021, 10:43 AM IST

హైదరాబాద్ జలవిహార్‌లో ఇవాళ అలయ్‌-బలయ్‌(Alai-Balai 2021) కార్యక్రమం జరగనుంది. కులమతాలకు అతీతంగా... తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయ పేర్కొన్నారు. హైదరాబాద్ జలవిహార్​లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏడాది దసరా తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. 16 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆలయ్-బలయ్ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

ఇవాళ జరగనున్న ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు.. గవర్నర్లు తమిళిసై, బిశ్వభూషణ్, బండారు దత్తాత్రేయ, రాజేంద్ర విశ్వనాథ్‌ పాల్గొంటారు. సీఎం కేసీఆర్‌తోపాటు వివిధ పార్టీల అధ్యక్షులు, నేతలు వస్తున్నారని బండారు విజయ తెలిపారు.

ఇదీ చదవండి: Tragic incident in Khammam: దుర్గామాత నిమజ్జనంలో విషాదం.. నలుగురి దుర్మరణం

Last Updated : Oct 17, 2021, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.