తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విజృంభణ, వరదల వల్ల ఆస్తి నష్టం వంటి విషాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. ఏటా నిర్వహించే అలయ్‌బలయ్ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. దసరా పర్వదినం వేళ పాలపిట్టను చూసి.. శమీ వృక్షాన్ని పూజించాలని సూచించారు. కరోనాపై విజయం సాధించాలని ఆకాంక్షించారు. కొవిడ్ రక్కసి నుంచి తేరుకొని.. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాక్షించారు.
తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన బండారు దత్తాత్రేయ - Bandaru Dattatreya wished the Telugu states people a happy Dussehra
విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ.. సంతోషకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు.
తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన బండారు దత్తాత్రేయ