కరోనాతో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రి, రామకృష్ణాపూర్లో మరణించిన నాయకుల కుటుంబాలను బాల్క సుమన్ పరామర్శించారు. కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకొని ఓదార్చారు.
అనంతరం సంపత్, రాజ్ కుమార్ కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న శ్రేణులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?