Balka Suman Fire on Teenmar Mallanna: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న జుగుప్సాకరమైన భాష వాడటం... భాజపా విష సంస్కృతిలో భాగమేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. భాజపా ఆటలో భాగంగా... బండి సంజయ్ చెబితేనే చింతపండు నవీన్ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజకీయాల్లోకి నేతల కుటుంబ సభ్యులను లాగడం భాజపాకు అలవాటేనన్నారు. గతంలో పలు రాష్ట్రాలో ఇలాగే వ్యవహరించిందని... తెలంగాణ సమాజం భాజపా తీరును గమనించాలన్నారు. తమ సహనానికి, సంయమనానికి కూడా హద్దు ఉంటుందని బాల్క సుమన్ హెచ్చరించారు.
డీజీపీ స్పందించాలి..
తన ఆస్తులపై కూడా సోషల్ మీడియాలో భాజపా దుష్ప్రచారం చేస్తోందని... ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న దానికంటే ఎక్కువగా ఉంటే బండి సంజయ్‌కే రాసిస్తానని బాల్క సుమన్ అన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబసభ్యులపై దుష్ప్రచారం చేస్తుంటే పోలీసులు ఎందుకు సుమోటోగా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా డీజీపీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాల్క సుమన్ కోరారు. తెరాస కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. తీన్మార్ మల్లన్నకు చెంప దెబ్బలు కాదని... చెప్పు దెబ్బలు పడాలని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.
నిరుద్యోగంపై దీక్ష చేస్తానని బండి సంజయ్ ప్రకటించడం హాస్యాస్పదమని.. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నరని సుమన్ ప్రశ్నించారు. దమ్ముంటే బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇప్పించాలన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం రైతు చట్టాలను రద్దు చేయడం రాజకీయం కాదా ప్రశ్నించారు. భాజపా, తెరాస సంబంధాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పిచ్చిమాటలని బాల్క సుమన్ కొట్టివేశారు.
రాజకీయాల్లో ఉన్న వ్యక్తులుగా... కుటుంబసభ్యులను, మహిళలను, చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగడం అనేది కరెక్ట్ కాదు. ఇది దుర్మార్గమైన చర్యగా మేం భావిస్తున్నాం. కాబట్టి నిన్న తెలంగాణ సమాజం కూడా అంతే రియాక్ట్ అయింది. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల వ్యక్తిత్వాల్ని దెబ్బతీయడం గానీ కించపర్చడం గానీ నకలీ ఫొటోలు పెట్టడం ఇలాంటివి భాజపాకు కొట్టిన పిండి. భాజపా విషసంస్కృతిని తెలంగాణ ప్రజలు గమనించాలి. దీని వెనక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు.
-- బాల్క సుమన్, ప్రభుత్వ విప్
ఇవీచూడండి:
KTR on teenmar mallanna tweet: 'నడ్డాజీ.. ఇదేనా మీరు నేర్పిస్తోంది..? ఇదేనా మీ సంస్కారం..?'