Balka Suman Fires On Sharmila: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రతినిధులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. షర్మిల అసభ్య వ్యాఖ్యలపై అందరూ ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నామని అన్నారు. ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించి.. నేడు తెలంగాణ ఆడబిడ్డను అనడం హాస్యాస్పదమని విమర్శించారు.
వైఎస్ కుటుంబమంతా తెలంగాణకు వ్యతిరేకమేనని బాల్కసుమన్ ఆరోపించారు. తెలంగాణ ఇవ్వొద్దని జగన్ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తు చేశారు. షర్మిల తీరు మారకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని హితవు పలికారు. జగన్ జైలుకెళ్లొచ్చిన దొంగ అని తాము అంటే ఏపీలో ఊరుకుంటారా అని ప్రశ్నించారు. వైఎస్ విషపు నవ్వులను తెలంగాణ సమాజం మరిచిపోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు.
"షర్మిల ఒక ట్వీట్ చేసింది. 2009 సెప్టెంబర్ 2న ఆరోజు రాజన్న తిరిగి వచ్చుంటే తెలంగాణకు రాకపోయింది. అంటే రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తెలంగాణకు రాకపోదు. తెలంగాణ వ్యతిరేక ప్రభావాన్ని ట్వీట్ చేసింది. అంటే తెలంగాణను, హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చింది." - బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
అసలేెం జరిగిదంటే: నిన్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. షర్మిలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అరెస్ట్ చేశారని.. ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, పోలీస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించారని, అధికారుల వస్తువులను సైతం లాక్కొనే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని, షర్మిలకు సూచించింది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని, ప్రజల పక్షాన నిలబడటం తప్పా అని ప్రశ్నించారు. అరెస్టు చేశాక.. తమ కార్యకర్తలను కొట్టాల్సిన అవసరం పోలీసులకు ఏముందన్న షర్మిల.. గురువారం నుంచి పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: అవినీతిని ఎత్తిచూపితే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు: షర్మిల
'తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా'
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ రోగం.. కఠిన చర్యలేవీ?
'మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్ష'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు