Balka Suman Complaint On Vivek Venkataswamy : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఎలక్షన్ యాడ్స్‌పై ఫిర్యాదులు రావడంతో కొన్నిటిని నిలిపివేశారు అధికారులు. నామినేషన్ల సమయంలో కూడా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఈసీకి కంప్లైంట్లు ఇస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టి నాయకుల్ని కొంటున్నారని.. ఆయన కంపెనీ నుంచి రూ.8 కోట్లు ఓ సూట్‌కేస్ కంపెనీకి బదిలీ చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కోట్ల రూపాయలతో నేతలను కొనుగోలు చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఆరోపించారు. వివేక్‌కు చెందిన కంపెనీ నుంచి సోమవారం ఎనిమిది కోట్లు ఓ సూట్‌కేస్ కంపెనీకి బదిలీ చేశారని సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులేనని అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసిన సుమన్.. వివేక్ పై ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓకు ఫిర్యాదు చేసినట్లు సుమన్ తెలిపారు. డబ్బు బదిలీ అయిన సూట్ కేసు కంపెనీ రామగుండంలో వివేక్ ఇంటి చిరునామా పైనే ఉందని తెలిపారు.ఆ ఖాతాను ఫ్రీజ్ చేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతోన్న ఎన్నికల ప్రచారాలు - రంగంలోకి దిగుతున్న స్టార్ క్యాంపెయినర్లు
Telangana Assembly Elections 2023 : ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు, ప్రత్యేక వ్యయ పరిశీలకునికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వివేక్ కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టాలని కోరినట్లు సుమన్ చెప్పారు. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నారన్న ఆయన.. ఆ పాపంలో పాలు పంచుకోవద్దని స్థానిక వ్యాపారులను కోరారు. డబ్బు అహంకారంతో వివేక్ నేతలను కొనుగోలు చేస్తున్నారన్న బాల్క సుమన్.. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని కోరారు.
కాంగ్రెస్ అగ్రనేతలతో సుడిగాలి ప్రచారాలకు ప్లాన్, ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ
ఇలాంటి నమ్మక ద్రోహి, మోసకారి వల్ల బీజేపీ కనీసం మేనిఫెస్టో కూడా ప్రకటించలేకపోయిందని వ్యాఖ్యానించారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తికి, వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ది చేస్తున్న వ్యక్తికి మధ్య చెన్నూరులో పోటీ జరుగుతోందని.. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక వివేక్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని సుమన్ ఆక్షేపించారు. వివేక్ కుటుంబం హయాంలో.. తమ హయాంలో చెన్నూరు అభివృద్దిపై చర్చకు సిద్దమని ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే - ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా : రేవంత్‌రెడ్డి
మా ధైర్యం తెలంగాణ ప్రజలు - బీఆర్ఎస్ను వాళ్లే కాపాడుకుంటారు : మంత్రి కేటీఆర్