అతివలకు అన్నిరంగాల్లో అవకాశమిచ్చినపుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని.... నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్- నివారణ చర్యలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులతో పాటు..... పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా హక్కులను కాపాడాల్సిన అవసరముందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
'ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానంగా అవకాశాలు అందుకుంటున్నారు. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అన్యాయాలపై ఎన్నో పోరాటల ఫలితంగా మహిళలకు అనేక రకాల హక్కులు, రక్షణలు లభించాయి. అయినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి.'
- నందమూరి బాలకృష్ణ
ఇదీ చూడండి: లైఫ్ సైన్సెస్ రంగాలకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్