గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలకు నిరసనగా... హైదరాబాద్ కోఠి కూడలిలో భజరంగ్‌దళ్ మౌన ప్రదర్శన నిర్వహించింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్న భజరంగ్ నాయకులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భగవంతుని పూజించేందుకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. వినాయక మండప నిర్వాహకులపై కేసులు పెడుతామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు.
కొవిడ్ నిబంధనల ప్రకారం వియనాయక మండలాలకు ప్రభుత్వం అనుమతినివ్వాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ కోరారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించడం వల్ల పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు