ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ.. బంజారాహిల్స్, మాదాపూర్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు షాపింగ్ మాల్స్‌లో విధ్వంసానికి దిగారు. జంటల కోసం సిద్ధం చేసిన డెకరేషన్లు, ఫర్నీచర్లను ధ్వంసం చేస్తూ... విదేశీ సంస్కృతి మనకొద్దంటూ నినాదాలు చేశారు.
ఈ ఘటనలో పోలీసులు ఇవాళ నలుగురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంపై తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'భారత బోల్ట్' పరుగు చూసారా? అవి కాళ్లా.. కారు చక్రాలా!