తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. రూ.50 వేల పూచీకత్తుతో సోంపేట అదనపు జిల్లా కోర్టు అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేసింది. పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెలుగుదేశం, వైకాపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
వైకాపా బలపరిచిన అభ్యర్థి వేరే గ్రామం వారితో కలిసి నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేయగా స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై కోటబొమ్మాళి పోలీసుస్టేషన్‌లో అచ్చెన్నాయుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్‌ను సెల్ఫీ కోరిన వృద్ధురాలు