నిషేధిత గుట్కా సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషిపై హైదరాబాద్‌లోని బహదూర్‌పుర పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 13న పీఎస్‌కు వచ్చిన సచిన్.. నోటీసులు తీసుకుని వెళ్లి వారంలోగా తన అడ్వకేట్ ద్వారా వివరణ ఇస్తానని స్పష్టం చేశారు.
ఈ ఏడాది మార్చి 3న బహదూర్‌పుర పీఎస్ పరిధిలో గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి జహంగీర్, జబ్బార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువచేసే గుట్కాను సీజ్ చేశారు. నిందితులను విచారించగా.. ఠాకూర్ సింగ్ అనే వ్యక్తితో పాటు గోవా గుట్కా ఉత్పత్తి సంస్థ యజమాని సచిన్ జోషిని కూడా నిందితులుగా చేర్చారు. మహారాష్ట్రంలో ఉంటే సచిన్ జోషికి నోటీసులిచ్చేందుకు బహదూర్‌పుర పోలీసులు అక్కడి వెళ్లగా.. నోటీసులు తీసుకునేందుకు సచిన్ స్వయంగా బహదూర్‌పుర పీఎస్‌కు వచ్చారు.