భద్రాద్రి సీతారామ కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ దంపతులకు అధికారులు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్‌కుమార్, ఆలయ ఈవో రమేష్‌బాబు, అర్చకులు ముఖ్యమంత్రిని కలిశారు. వేద పండితులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కల్యాణ ఉత్సవాలకు సీఎం హాజరు కాలేదు.
ఇదీ చదవండి :ఎగ్జిబిషన్, సమావేశాల అనుమతులకు పటిష్ఠమైన నిబంధనలు