Car Presented To Gymnast aruna reddy: అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీల్లో రెండు స్వర్ణాలు సాధించిన అరుణారెడ్డికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ కియా కారును బహుమతిగా అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా క్రీడాకారిణికి కారు తాళాలు అందించారు. హైదరాబాద్ చెందిన అరుణారెడ్డి ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా జరిగిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీల్లో రెండు స్వర్ణాలతో చరిత్ర సృష్టించింది.
Gymnast aruna reddy: జిమ్నాస్టిక్స్‌లో దేశానికి రెండు స్వర్ణ పతకాలు సాధించడం గొప్ప విషయమని చాముండేశ్వరినాథ్ అన్నారు. భవిష్యత్తులోనూ తన వంతు సహకారమందిస్తానని ఆయన తెలిపారు. రాబోయే కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్, ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించడమే తన ముందున్న ప్రస్తుత లక్ష్యమని జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి అరుణారెడ్డి తెలిపారు. దేశానికి తొలిసారి రెండు స్వర్ణ పతకాలు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని అరుణా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.