ETV Bharat / state

ట్రాఫిక్​ జామ్ కారణంగా అంబులెన్స్​లోనే బిడ్డకు ప్రసవం... - DELIVARY IN TRAFFIC

కొన్ని సినిమాల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ... ట్రాఫిక్​లో ఇరుక్కుంటుంది. దగ్గర్లో ఆస్పత్రి లేదు. పరిస్థితి చేజారిపోతున్న సమయంలో హీరోనో... హీరోయినో వచ్చి పురుడు పోస్తుంది. అచ్చం ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది హైదరాబాద్​లో...! పురిటి నొప్పులతో ఆస్పత్రికి బయలుదేరిన ఓ గర్భిణీ... ట్రాఫిక్​ కారణంగా అంబులెన్స్​లోనే తన బిడ్డకు జన్మనిచ్చింది.

BABY DELIVERY IN TRAFFIC JAM IN HYDERABAD MALAKPET
author img

By

Published : Oct 4, 2019, 8:24 AM IST

హైదరాబాద్​ మలక్​పేటలోని నల్గొండ చౌరస్తాలో అంబులెన్స్​లో ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన రవి, గౌరి దంపతులు బడంగ్​పేటలో నివాసముంటోంది. గౌరికి నెలలు నిండగా... పురిటి నొప్పులు వచ్చాయి. ఆలస్యం అవుతోందని క్యాబ్​లో ఆస్పత్రికి బయలుదేరారు. సంతోష్​నగర్​ కూడలిలో 108 అంబులెన్స్​ సిబ్బంది గర్భిణీని ఎక్కించుకున్నారు. పేట్ల బురుజు ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గంలో తీవ్రంగా ట్రాఫిక్​జామ్​ అయ్యింది. ఆలస్యం కావటం వల్ల మధ్యలోనే గౌరి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను అంబులెన్స్​ సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించగా... ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ట్రాఫిక్​ జామ్ కారణంగా అంబులెన్స్​లోనే బిడ్డకు ప్రసవం...

ఇవీ చూడండి: అద్భుత బాలుడి పలుకే సంగీతమాయెనే!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.