హైదరాబాద్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్షన్ ఎక్బాల్ కాలనీ సమీపంలోని నాలాలో ఓ పసిపాప మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వెంటనే చంద్రాయణ గుట్ట పోలీసులకు సమాచారం తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ పాప వయసు సుమారు 2 నుంచి 3 నెలల వయసు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : సామూహిక గొర్రెల షెడ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్