Bahubali Ship to Visakha: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఓడరేవుకు శనివారం పొడవైన నౌక వచ్చింది. ‘ఎంవీ జీసీఎల్ సబర్మతి బేబీ కేప్’ పేరున్న ఈ నౌక పొడవు 253.50 మీటర్లు. వెడల్పు 43 మీటర్లు. ఒకే సారి 1,06,529 టన్నుల బరువైన సరకును తరలించే సామర్థ్యం ఈ నౌక సొంతం. ప్రస్తుతం సున్నపు రాయి లోడుతో ఇక్కడికొచ్చింది. రేవులోని వెస్ట్‌క్వే-1 బెర్త్‌లో దీన్ని విజయవంతంగా నిలిపారు.
విశాఖ ఓడ రేవులో ఇంతటి భారీ నౌకను నిలపడం ఇదే తొలిసారని పోర్టు ట్రస్టు ఛైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు.
ఇవీ చదవండి: