బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు ఆయుష్ వైద్య విధానంలో చికిత్స ఉన్నట్లు ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలగు వర్శి తెలిపారు. ఈ నెల 18న ఆయుష్ వైద్య విధానంలో బ్లాక్ ఫంగస్ చికిత్స గూర్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగిందని డాక్టర్ వర్శి అన్నారు. ఆయుర్వేద, హోమియో, యునాని వైద్య విధానానికి సంబంధించి పలువురు విశ్లేషకులు వారి సూచనలు చేశారని చెప్పారు.
కొవిడ్ చికిత్సకు అల్లోపతిలో అధికంగా స్టిరైడ్స్ వాడటం, మధుమేహం నియంత్రణ లేకపోవడం వలన బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఏర్పడుతుందని డాక్టర్ వర్శి అన్నారు. కొవిడ్ నుంచి కోలుకుంటున్న వ్యక్తులు, మధుమేహం నియంత్రణ లేని వారు హోమియో మందులు ఆర్సెనికం ఆల్బం200ఎంజీ మాత్రలు ఐదు రోజులు, ఫైవ్ ఫాస్6x మాత్రలు నెల రోజుల పాటు వాడుతూ... తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుందన్నారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం