Awareness walk on autism: హైదరాబాద్ స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఆటిజంపై అవగాహన నడకను మాజీ మిస్ ఇండియా జాహ్నవి బజాజ్ ప్రారంభించారు. బుద్దిమాంద్యం కలిగిన చిన్నారుల పట్ల జాలి చూపకుండా వారికి చేయూతనివ్వాలని ఆమె సూచించారు. పీపుల్స్ ప్లాజా నుంచి జల విహార్ వరకు కొనసాగిన నడకలో ఆటిజంతో బాధపడే చిన్నారులు, పలువురు వైద్యులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆటిజం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ ప్రతినిధి శిల్ప తెలిపారు. తద్వారా బాధితుల పట్ల సానుకూల వాతావరణం నెలకొంటుందన్నారు. ఆటిజంను తొలి దశలో గుర్తిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని చెప్పారు. మాములు పిల్లల కంటే ఈ పిల్లలు ప్రత్యేకమైన వారని.. వారితో ఏ విధంగా వ్యవహరించాలో తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలాజిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, భాజపా మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్కా మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: TRS Deeksha: దిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెరాస దీక్షకు ఏర్పాట్లు