కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు, యశోద ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఎంవీ రావు ప్రజలకు కరోనా నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చేతులను పరిశుభ్ర పరచుకోవడం సహా... లక్షణాలు ఉన్నవారు తప్పక వైద్యులను సంప్రదించాలని సూచించారు. గాంధీలో 200 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని... 69 మంది ప్రస్తుతం కరోనాకి చికిత్స పొందుతున్నారని డాక్టర్ రాజారావు వివరించారు. కరోనా సోకిన వారిలో కూడా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయితే తప్ప ఎలాంటి ప్రమాదం లేదని.. యుక్త వయస్సు వారిలో ఇది అంత ప్రమాదకరం కాదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం