జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బేగంపేటలోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇందుకోసం రోడ్డు పైనే డ్రామాను ప్రదర్శించారు.
రోడుపై జరిగే ప్రమాదాలను నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడాలి అనే అంశంపై విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డుపై ఎలా నడవాలి.. జీబ్రా క్రాసింగ్‌ను దాటే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చిన్న చిన్న నాటకాలు, నృత్యాల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేగంపేట ట్రాఫిక్ పోలీసు సీఐ అరలప్పా, ఇన్స్‌పెక్టర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: షేక్‌పేటలో విషాదఛాయలు.. స్వస్థలానికి అరకు మృతదేహాలు