ETV Bharat / state

నేడు పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహన సదస్సు

నేడు ప్రగతిభవన్​లో కొత్త పంచాయతీరాజ్​చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. కొత్త చట్టంపై కేసీఆర్​ దిశానిర్దేశం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను జిల్లాకు కొంతమందిచొప్పున ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

panchayat
author img

By

Published : Feb 4, 2019, 7:02 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పంచాయతీరాజ్​చట్టంపై అవగాహన సదస్సు సోమవారం ప్రగతిభవన్​లో జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి, పంచాయతీరాజ్​ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా పరిషత్​, మండల పరిషత్​ అధికారులు, పంచాయతీ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులను జిల్లాకు కొంతమంది చొప్పున దీనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్త పంచాయతీరాజ్​ చట్టం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ దిశానిర్దేసం చేయనున్నారు. ముందుగా అధికారులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా సర్పంచులకు, ఉప సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

TEST FROM FEEDROOM
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.