దేశంలోనే అత్యంత వేగంగా ఆర్థికంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని.. అందుకు ఇక్కడి శాంతి భద్రతలు అదుపులో ఉండటమే కారణమని అదనపు డీజీ జితేందర్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసులు పరిష్కరించిన సిబ్బందికై ఏర్పాటు చేసిన అవార్డు మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పించిన పలువురు పోలీసు, కోర్టు సిబ్బందికి ఆయన ఆవార్డులు అందజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 62 కీలక కేసుల్లో 89 మంది నిందితులను జైలుకు పంపినట్టు ఆయన తెలిపారు. కేసుల్లో జీవిత ఖైదుతో పాటు ఇరవై ఏళ్ల జెలు శిక్ష పడిదంటే ఇందులో పోలీసుల నిబద్దత శ్రమ అర్ధమవుతుందని తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం సంచాలకురాలు వైజయంతి అన్నారు. 62 కేసుల్లో నిందితులకు శిక్షలు పడడమంటే మామూలు విషయం కాదన్నారు. నిందితులకు శిక్ష పడేలా చేసినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతోందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు.
ఇవీ చూడండి: వీల్ స్పిన్‌తో ఆఫర్లు... ఆడారో ఖాళీ అవుతాయి మీ అకౌంట్లు