సేవా స్ఫూర్తితో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ పేద విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంట్ స్థాపించడం సంతోషకరమని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫక్రుద్దీన్ అన్నారు. బోరబండ డివిజన్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను అవతార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ గుప్తాతో కలిసి డిప్యూటీ మేయర్ ప్రారంభించారు. బాలికల హాస్టల్ ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్, విద్యుత్ మోటార్‌ను డిప్యూటీ మేయర్ బాబా ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్నో సేవ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ తరపున చారిటబుల్ ట్రస్ట్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
అవతార్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం - అవతార్ చారిటబుల్ ట్రస్ట్
ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫక్రుద్దీన్ అన్నారు. బోరబండ డివిజన్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.