ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఖైరతాబాద్‌లోని ఆర్‌టీఏ కార్యాలయంలో ఆటో జేఏసీ, క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ, లారీ అసోసియేషన్ జేఏసీ నేతలు నిరసనకు దిగారు. 19వ తేదీలోపు ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించకపోతే మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పడుతుందని హెచ్చరించారు. ఈనెల 19న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: 'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'