ETV Bharat / state

"ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుతున్నాం.. ఇప్పుడు సిటీలో నడపొద్దంటే ఎలా.?" - auto unions

Auto Unions Protests: ఇతర జిల్లాలకు చెందిన ఆటోలను హైదరాబాద్​లో తిరగనీయకపోవడాన్నినిరసిస్తూ ఆటో సంఘాలు ఆందోళనకు దిగాయి. ఖైరతాబాద్​లోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు, యజమానులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ నగర పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలనే నిబంధన పెట్టడం అన్యాయమని ఆటో సంఘాలు ఆరోపించాయి. దీనివల్ల 3 లక్షల మంది ఉపాధి కోల్పోతారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు "ఈటీవీ భారత్" ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.

auto unions protests
హైదరాబాద్​లో ఆటో డ్రైవర్ల ఆందోళన
author img

By

Published : Feb 28, 2022, 3:38 PM IST

Auto Unions Protests: ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి లక్షల మంది నగరంలో ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నామని పేర్కొన్నారు. "గతంలో సీఎన్​జీ ఆటోలు కొనమని ప్రభుత్వం చెప్పింది. జిల్లాల్లో సీఎన్​జీ బంకులు లేవు. అందుకే నగరాల్లో నడుపుతున్నాం. ఇప్పుడు కాలుష్యం పేరుతో ఇతర జిల్లాల ఆటోలు నగరంలో నడపొద్దని చెబుతున్నారు. కొనమని చెప్పేది వారే.. వద్దని చెప్పేది వారే అని" అసహనం వెలిబుచ్చారు. తమ సమస్యపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ స్పందించాలని డిమాండ్​ చేశారు.

ఆటో సంఘాల ఆందోళన

ఇదీ చదవండి: Autos in Hyderabad : 'ఇతర జిల్లాల్లో రిజిస్టరైన ఆటోలకు నగరంలో ప్రవేశం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.