ETV Bharat / state

ఆటో ఫైనాన్స్​లను 9 నెలలు వాయిదా వేయాలి: ఆటో డ్రైవర్లు - హైదరాాబాద్​ వార్తలు

కరోనా సమయంలో లాక్​డౌన్ విధించటం వల్ల ఆటో రంగంపై ఆధారపడిన 6 లక్షల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో ఫైనాన్స్​లను 9 నెలల వరకు వాయిదా వేయాలని కోరుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

Auto drivers protest in front of rta office khairathabad in hyderabad
ఆటో ఫైనాన్స్​లను 9 నెలలు వాయిదా వేయాలి: ఆటో డ్రైవర్లు
author img

By

Published : Jul 3, 2020, 4:43 PM IST

ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఆటో ఫైనాన్స్​లను 9 నెలల వరకు వాయిదా వేయాలని కోరుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో లాక్​డౌన్ విధించటం వల్ల ఆటో రంగంపై ఆధారపడిన 6 లక్షల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం లాక్​డౌన్ ఎత్తివేసి ఆటోలకు సడలింపులిచ్చినా ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదన్నారు. వ్యాపారాలు లేనందున ఆటోలకు గిరాకీ లేక, పెట్రోల్​, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్​లో సుమారు 2 లక్షల పైగా ఆటో డ్రైవర్లు ఆటోల మీద ఆధారపడి జీవిస్తున్నారని నూటికి నూరు శాతం ప్రైవేటు ఫైనాన్సర్ల ద్వారానే ఆటోలు కొనుక్కొని నడుపుతూ నెలల వారీగా ఈఎంఐలు చెల్లించేవారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

ఆటో ఫైనాన్స్​లను 9 నెలలు వాయిదా వేయాలి: ఆటో డ్రైవర్లు

ఇదీ చూడండి:ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నగరానికి వచ్చేస్తున్న బామ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.