రైల్వేస్టేషన్ వద్ద తాగిన మత్తులో ఆటో డ్రైవర్ హల్చల్ సృష్టించిన ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ ఆటోతో పాదచారులు, వాహనదారుల మీదకు దూసుకెళ్లగా ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. అడ్డదిడ్డంగా ఆటో నడపగా బోల్తా పడింది.
వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సీసీ వీడియోల ఆధారంగా గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన పాదచారుడు వరంగల్ చెందిన ప్రసాద్‌గా గుర్తించారు. ఆటో డ్రైవర్ స్పృహలో లేకపోవడం వల్ల అతనిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు