ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం ప్రదర్శించాడు. ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అని చూడకుండా కాలుతో తన్నాడు. ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన సీఎం జగన్ నివాస ప్రాంతంలో జరగడం గమనార్హం.
అసలేం జరిగిందంటే...
విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ పోకల కృష్ణకు.. గోవర్ధని అనే మహిళ అప్పు ఇచ్చింది. దానిని తీర్చాలని ఆమె ఆటో డ్రైవర్ను అడిగింది. కోపోద్రిక్తుడైన గోపికృష్ణ.. గోవర్ధినిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆ మహిళ అక్కడిక్కడే కుప్పకూలింది. భాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని మంగళగిరి రూరల్ ఎస్సై లోకేశ్ తెలిపారు.
ఇదీ చూడండి: murder: ఓ భర్త కిరాతకం.. సినీ ఫక్కీలో భార్యను కడతేర్చాడు