గురుకులాల పీఈటీ అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ఉద్యోగాలకు ఎంపికైనా నియామక పత్రాలు ఇవ్వడంలేదని ఆందోళనకు దిగారు. 616 మంది అభ్యర్థులకు గురుకులాల్లో పీఈటీ పోస్టులకు నియామక పత్రాలు ఇవ్వాలని నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.
- ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్