కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించడంలేదన్న విషయం వెలుగుచూసింది. దీంతో పలు చికెన్ సెంటర్లు, మటన్ దుకాణాలపై కేసులు నమోదు చేశారు. కిలో మటన్ రూ.700కు మించి విక్రయించకూడదంటే చాలా చోట్ల రూ.900 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ రూ.257లకు అమ్మాలని నిర్ణయిస్తే రూ.270, రూ.290కు అమ్ముతున్నారు.
నిల్వమాంసం.. బూజుపట్టిన మేక తలలు
పంజాగుట్ట సర్కిల్ సమీపంలోని ఏ1 మాంసం దుకాణానికి టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు బృందం, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బాబు బేరి వెళ్లారు. ఏమాత్రం శుభ్రత లేదని గుర్తించారు. ‘‘చాలా చోట్ల మాంసాన్ని నిల్వ ఉంచారు. ఫ్రిజ్‌లో ఉన్న మేక, గొర్రెల తలలు బూజుపట్టి ఉన్నాయి. చికెన్, మాంసాన్ని ఉంచి వాటిపై ఐస్ పెట్టారని’’ డాక్టర్ బాబు బేరి తెలిపారు. గొర్రె, మేక మాంసాలను కలిపి విక్రయిస్తున్నట్టు తమకున్న అనుమానం మేరకు కొన్ని దుకాణాల్లో శాంపిళ్లను సేకరించామన్నారు. కేసుల నమోదు చేసి పంజాగుట్ట కూడలి సమీపంలోని నాలుగు దుకాణాలను సీజ్ చేశామన్నారు.
ఇదీ చదవండి: శంషాబాద్ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట