ETV Bharat / state

డెలివరీ బాయ్​పై దాడి.. ముగ్గురి అరెస్ట్

స్విగ్గీ సంస్థకు చెందిన డెలివరీ ఏజెంట్​కి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ముగ్గురు వ్యక్తులు... పార్శిల్​తో రాగానే అతనిపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలో జరిగింది. అనంతరం సెల్ ఫోన్, డబ్బులను లాక్కున్నారు. స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

'పోలీసుల అదుపులో నేరగాళ్లు'
'పోలీసుల అదుపులో నేరగాళ్లు'
author img

By

Published : Feb 11, 2020, 9:31 AM IST

Updated : Feb 11, 2020, 10:47 AM IST

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలో ముగ్గురు వ్యక్తులు స్విగ్గీ సంస్థకు ఫుడ్ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ సంబంధిత పార్శిల్ తెచ్చాక... నిందితులు మణిదీప్, వినయ్, వీరేష్​లు అతనిపై దాడి చేశారు. బాధితుడి దగ్గరున్న సెల్​ఫోన్, విలువైన వస్తువులు దోచుకున్నారు. ఇదే వృత్తిగా ఈ ముగ్గురూ తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు.

'పోలీసుల అదుపులో నేరగాళ్లు'

సెల్​ఫోన్, విలువైన వస్తువుల దోపిడీ

ఈనెల 3న రాత్రి 10 గంటల సమయంలో ఫుడ్ కావాలని స్విగ్గీకి ఫోన్ చేయగా... డెలివరీ బాయ్ ఫుడ్​తో జగద్గిరిగుట్ట వచ్చి మనిదీప్​కు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులు డెలివరీ బాయ్​ని రావి నారాయణ రెడ్డి నగర్ వద్దకు రమ్మని సూచించారు. ఘటనా స్థలానికి వచ్చిన బాధిత ఏజెంట్​ని... సమీపంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్ళి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, విలువైన వస్తువులను దోచేశారు. బీర్ సీసాతో దాడికి యత్నించగా డెలివరీ బాయ్​ అరుచుకుంటూ రోడ్డు వైపు పరుగులు తీశాడు.

నిందితులపై రౌడీ షీట్...

అరుపులు విన్న స్థానికులు బాధితుడ్ని కాపాడారు. అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుండి పారిపోయారు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడి సెల్ ఫోన్, కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకుని రిమాండ్​కు తరలించారు. గతంలోనూ వీరిపై పలు పీఎస్​ల్లో సెల్ ఫోన్, స్నాచింగ్, దారి దోపిడీ కేసులు ఉన్నాయి. వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బాలానగర్ ఏసీపీ పురుషోత్తమ్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : పెద్దపులి కలకలం... కాపరి చూస్తుండగానే ఆవులమందపై దాడి

Last Updated : Feb 11, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.