ఆస్ట్రానమీపై పూర్తి అవగాహన కోసం పదిరోజుల సర్టిఫికెట్ కోర్సు ఓయూలోని ఆస్ట్రానమీ విభాగంలో ప్రారంభించారు. ఈ కోర్సులో చేరేందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. జులై ఎనిమిది నుంచి 19 వరకు తరగతులు జరగనున్నాయి. కేవలం ఇంటర్లో సైన్స్ గ్రూపు చదివిన విద్యార్థులతో పాటు ఏ గ్రూపు చదివిన విద్యార్థులైనా ఆస్ట్రానమీపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ పది రోజుల కోర్సు ఎంతో ఉపయోగపడుతోందని ఓయూ ఆస్ట్రానమీ విభాగాధిపతి శాంతిప్రియ తెలిపారు. ఏటా మే నెలలో నోటిఫికేషన్ విడుదలవుతుందని జులైలో తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. కేవలం మూడువేల రూపాయలు రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించి ఈ కోర్సులో చేరవచ్చని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేస్తామన్నారు.
ఇదీ చూడండి: డబ్బులు తేవాలని ర్యాగింగ్... విద్యార్థి ఆత్మహత్యయత్నం