ETV Bharat / state

'కొవిడ్ వచ్చిన 262 మంది జర్నలిస్టులకు సాయం' - కరోనా పాజిటివ్ జర్నలిస్టులకు రూ.20 వేలు

రాష్ట్రంలో కొవిడ్​ బారిన పడిన 262 మంది జర్నలిస్టులకు సహాయం చేశామని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. మొత్తం 44 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా జర్నలిస్టు మిత్రులు పాజిటివ్​ వచ్చి సాయం అందని వారు ఉంటే.. తమ వివరాలను రాష్ట్ర మీడియా ఛైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్​కి పంపాలని సూచించారు.

Assistance to all 262 journalists corona positive in telangana
'కొవిడ్ వచ్చిన 262 మంది జర్నలిస్టులందరికీ సహాయం'
author img

By

Published : Jul 16, 2020, 6:59 PM IST

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 262 మంది జర్నలిస్టులకు 44 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వారిలో పాజిటివ్ వచ్చిన 185 మంది జర్నలిస్టులకు రూ. 20 వేల చొప్పున.. మొత్తం 37 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. హోం క్వారంటైన్​లో ఉన్న 77 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున, 7 లక్షల 70 వేల రూపాయలను అందిచామని పేర్కొన్నారు.

గురువారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. తాజాగా 36 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. మరో ఐదు మంది జర్నలిస్టులు హోం క్వారంటైన్​లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని తెలిపారు. వారందరికీ 7 లక్షల 70 వేల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టుల ఆన్​లైన్ అకౌంట్​లో జమ చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా జర్నలిస్టు మిత్రులు పాజిటివ్​ వచ్చి సాయం అందని వారు ఉంటే తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా ఛైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్​కి పంపాలని అన్నారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని అల్లం నారాయణ సూచించారు.

ఇదీ చూడండి : ఉస్మానియా ఆస్పత్రిని ఆధునిక హంగులతో నిర్మించాలి : ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.