అసెంబ్లీ ప్రాగణంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి నిర్వహించారు. అసెంబ్లీ ముందు ఉన్న గాంధీ విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకు ముందు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం