ETV Bharat / state

'రాష్ట్రానికి వెలుగులు పంచిన ఘనత కేసీఆర్​దే' - assembly

పురపాలక, ఇంధన, నీటిపారుదల, రహదార్లు-భవనాల శాఖల పద్దులకు ఇవాళ శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక శాఖలో సంస్కరణలు తీసుకొచ్చామని... కొత్త మున్సిపాలిటీల్లోనూ వసతులు కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. దాదాపు 13 లక్షల కొత్త ఆయకట్టుకు నీరిచ్చామన్న సర్కార్... ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేసింది. పనులు కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

assembly
author img

By

Published : Sep 17, 2019, 11:49 PM IST

బడ్జెట్​పై రెండో రోజు చర్చలో భాగంగా ఇవాళ నాలుగు పద్దులపై చర్చ జరిగింది. పురపాలక, ఇంధన, రహదార్లు-భవనాలు, నీటిపారుదల శాఖల పద్దులను మంత్రులు సభలో ప్రవేశపెట్టిన అనంతరం చర్చ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులు మెరుగుపరచాలని, రహదార్లు అభివృద్ధి చేయాలని మజ్లిస్ సభ్యుడు కౌసర్ కోరారు. నీటిపారుదల ప్రాజెక్టులు యుద్ధప్రాతిదికన పూర్తి చేస్తూ కేసీఆర్... దేశానికే ఆదర్శంగా నిలిచారని బాల్క సుమన్ అన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తాము సంతోషించామన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బడ్జెట్​ను చూస్తే నిరుత్సాహం కలిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ను పర్యాటక ప్రాంతంగా మార్చారని ఆక్షేపించారు. ఇష్టం ఉన్న ప్రాజెక్టులనే చేపడుతున్నారని... నల్గొండ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. సమాధానమిచ్చిన మంత్రులు... రాజగోపాల్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చారు.

'వలసలు వాపస్ వచ్చేలా చేసిన చరిత్ర తెరాసది'

మెట్రో రైలును శంషాబాద్​ విమానాశ్రయం వరకు విస్తరిస్తాం:

పురపాలక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్న మంత్రి కేటీఆర్... కొత్త మున్సిపాలిటీల్లో వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. భాగ్యనగరంలో రోడ్ల మెరుగుదలకు రూ.2300 కోట్లు, పారిశుద్ధ్యం కోసం రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని కేటీఆర్ వివరించారు. మూసీ సుందరీకరణ హామీకి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం పూర్తితో నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపామని చెప్పారు. మెట్రో రైలును శంషాబాద్​ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని చెప్పారు

రహదార్ల విషయంలో 50 ఏళ్లలో చేయనిది ఐదేళ్లలో చేశామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... రహదార్లకు రూ.12,405కోట్లు, భవనాలకు రూ.598 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. చీకట్లను అధిగమించి రాష్ట్రానికి వెలుగులు పంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్​ రెడ్డి తెలిపారు.​ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని... కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్​ను సమకూర్చుకున్నామని తెలిపారు.

వలసలు వెళ్లినవాళ్లు వాపస్ వచ్చేలా చేసిన చరిత్ర తెరాసది:

నీటిపారుదల శాఖ పద్దుకు ముఖ్యమంత్రి తరఫున ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు సమాధానమిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికే మార్గం చూపిందని... వలసలు వాపస్ వచ్చేలా చేసిన చరిత్ర తెరాసదేనని అన్నారు. మనగడ్డ మీద మన నీళ్లను ప్రజలు చూడటానికి పోతోంటే కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు వస్తున్నాయన్న మంత్రి... రేపు కాల్వల ద్వారా నీళ్లు వస్తే కాంగ్రెస్​ అడ్రస్ గల్లంతవుతుందని వ్యాఖ్యానించారు.

చర్చ, సమాధానం అనంతరం పద్దులు సభ ఆమోదం పొందాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అందుబాటులో లేకపోవడం వల్ల పంచాయతీరాజ్ పద్దును తీసుకోలేదు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

ఇవీ చూడండి:'తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కల్పిస్తాం'

File : TG_Hyd_79_17_Demands_Pkg_3053262 From : Raghu Vardhan Note : Use live feed ( ) పురపాలక, ఇంధన, నీటిపారుదల, రహదార్లు-భవనాల శాఖల పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలకశాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చామని... కొత్త మున్సిపాల్టీల్లోనూ వసతులు కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. మెట్రో రైల్ ను శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని ప్రకటించింది. ఆర్ అండ్ బీలో కేవలం 1200 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. దాదాపు 13 లక్షల కొత్త ఆయకట్టుకు నీరిచ్చామన్న సర్కార్... ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని తెలిపింది. పనులు కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేసింది...లుక్ వాయిస్ ఓవర్ - 01 పద్దులపై రెండో రోజు చర్చలో భాగంగా ఇవాళ ఐదు పద్దులపై చర్చ జరిగింది. పురపాలక, ఇంధన, రహదార్లు-భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల పద్దులను మంత్రులు సభలో ప్రవేశపెట్టిన అనంతరం చర్చ ప్రారంభించారు. మజ్లిస్ సభ్యుడు కౌసర్ మొయియుద్దీన్, తెరాస సభ్యులు నన్నపనేని నరేందర్, పద్మాదేవేందర్ రెడ్డి, బాల్క సుమన్, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులు మెరుగుపరచాలని, రహదార్లు అభివృద్ధి చేయాలని మజ్లిస్ సభ్యుడు కౌసర్ కోరారు. నీటిపారుదల ప్రాజెక్టులు యుద్దప్రాతిదికన పూర్తి చేస్తూ కేసీఆర్... దేశానికే ఆదర్శంగా నిలిచారని బాల్క సుమన్ అన్నారు. మంచి పనులు చేస్తోన్న కేసీఆర్ ను అభినందించాల్సింది పోయి విమర్శించడం తగదని సూచించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తాము సంతోషించామన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బడ్జెట్ ను చూస్తే నిరుత్సాహం కలిగిందని అన్నారు. అప్పుల పాలు చేశారని, బిల్లులు పేరుకుపోయాయన్న ఆయన... కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా మార్చారని ఆక్షేపించారు. ఇష్టం ఉన్న ప్రాజెక్టులనే చేపడుతున్నారని... నల్గొండ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ లా మారుతామన్నారన్న రాజగోపాల్ రెడ్డి... కనీసం రహదార్లపై గుంతలు పూడిస్తే చాలని వ్యాఖ్యానించారు. బైట్ - కౌసర్ మోయియుద్దీన్, మజ్లిస్ సభ్యుడు బైట్ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు బైట్ - బాల్క సుమన్, తెరాస సభ్యుడు వాయిస్ ఓవర్ - 02 చర్చకు సమాధానమిచ్చిన మంత్రులు... రాజగోపాల్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చారు. పురపాలక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్న మంత్రి కేటీఆర్... కొత్త మున్సిపాలిటీల్లో వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. వ్యర్థాల నిర్వహణలో పురోగతి సాధిస్తున్నామని... మిషన్ భగీరథ మొత్తం పూర్తయ్యాక పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల విషయమై మరింత స్పష్టత ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఎస్సార్డీపీ కింద వెయ్యికోట్లు ఖర్చు చేశామని... మరో 2400 కోట్ల మేర పనులు కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో రోడ్ల మెరుగుదలకు 2300 కోట్లకు పైగా, పారిశుధ్యం కోసం 800 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని కేటీఆర్ వివరించారు. మూసీలో కాలుష్యంపై ఆందోళనను గుర్తిస్తున్నామని... మురుగునీటిని మరింతగా శుద్ది చేస్తామని చెప్పారు. కాళేశ్వరం పూర్తితో హైదరాబాద్ మంచినీటికి భవిష్యత్ తరాలకు సీఎం కేసీఆర్ ఇబ్బంది లేకుండా చేశారన్న మంత్రి... రింగ్ మెయిన్ చుట్టూ ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. మెట్రోలో మూడు లక్షల మంది ప్రయాణిస్తున్నారని... విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. బైట్ - కె.టి.రామారావు, పురపాలక శాఖా మంత్రి వాయిస్ ఓవర్ - 03 రహదార్ల విషయంలో 50 ఏళ్లలో చేయనిది ఐదేళ్ళలో చేశామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... రహదార్లకు 12405కోట్లు, భవనాలకు 598 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మొత్తం 13వేల కోట్లకు పైగా చెల్లింపులు చేయగా... మరో 1200 కోట్ల బిల్లులు మాత్రమే వివిధ కారణాల వల్ల పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 31345 కిలోమీటర్ల మేర రోడ్ నెట్ వర్క్ ఉందని... 3135కిలోమీటర్ల మేర జాతీయరహదారుల మంజూరుకు కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. గుత్తేదార్ల తరపున కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. చీకట్లను అధిగమించి రాష్ట్రానికి వెలుగులు పంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్న విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి... ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి రాద్ధాంతం చేస్తున్నాయని ఆక్షేపించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచితవిద్యుత్ ఇస్తున్నామని... కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ ను సమకూర్చుకున్నామని తెలిపారు. బైట్ - వేముల ప్రశాంత్ రెడ్డి, రహదార్లు - భవనాల శాఖా మంత్రి బైట్ - జి.జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి వాయిస్ ఓవర్ - 04 నీటిపారుదల శాఖ పద్దుకు ముఖ్యమంత్రి తరపున ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. ఎక్కువ రోజులు సభ నడపాలని కోరిన కాంగ్రెస్ సభ్యులు సభలో లేరన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలను చూసి వారికి నిరుత్సాహం కలగడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. నీటిపారుదల ప్రాజెక్ట్ ల నిర్మాణంలో తెలంగాణ దేశానికే మార్గం చూపిందని... వలసలు వాపస్ వచ్చేలా చేసిన చరిత్ర తెరాసదని అన్నారు. మనగడ్డ మీద మన నీళ్లను చూడ్డానికి పోతోంటే కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు వస్తున్నాయన్న మంత్రి... రేపు కాల్వల ద్వారా నీరొస్తే అడ్రస్ గల్లంతవుతుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, ఎస్సారెస్పీ ఫలితాలు అందుతున్నాయన్న హరీష్ రావు... 12.90 లక్షల కొత్త ఆయకట్టుకు నీరివ్వడం సహా 14లక్షల ఎకరాలు స్థిరీకరించుకున్నట్లు వివరించారు. ప్రతిపక్షం బలంగానే ఉండాలని తాము కోరుకుంటామన్న మంత్రి... అడ్డగోలుగా మాట్లాడి అభాసుపాలు కావద్దని సూచించారు. బైట్ - టి.హరీష్ రావు, ఆర్థిక శాఖా మంత్రి ఎండ్ వాయిస్ ఓవర్ - చర్చ, సమాధానం అనంతరం పద్దులు సభ ఆమోదం పొందాయి. మంత్రి అందుబాటులో లేకపోవడంతో పంచాయతీరాజ్ పద్దును తీసుకోలేదు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.