నూతన పురపాలక చట్టం ఆమోదం కోసం ఈనెల 18, 19 తేదీల్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 18న శాసనసభలో పురపాలక చట్ట బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బిల్లును సభ్యులు అధ్యయనం చేసేందుకు ఒక రోజు సమయం ఇస్తారు. 19న అసెంబ్లీలో బిల్లుపై చర్చ, ఆమోద కార్యక్రమం ఉంటుంది. అదేరోజు మండలి సమావేశమై బిల్లుపై చర్చించనుంది.
కేవలం బిల్లు కోసం మాత్రమే సమావేశాలు
కేవలం బిల్లు కోసం మాత్రమే సమావేశాలను నిర్వహిస్తారు. ప్రశ్నోత్తరాలు సహా ఇతరత్రా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోరని తెలుస్తోంది. నూతన పురపాలక చట్ట బిల్లు ముసాయిదా ఇప్పటికే సిద్ధమైంది. పరిశీలన కోసం న్యాయశాఖకు పంపారు. కొత్త చట్టం ఆమోదం పొందాకే ఆగస్టు నెల మొదటి వారంలో పురపాలక ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇవీ చూడండి: సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై విచారణ వాయిదా