ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. సీఎం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రజాపద్దుల సంఘం, అంచనాల సమితి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి సభ్యులను సభాపతి పోచారం ప్రకటించారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా సోలిపేట రామలింగారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి ఛైర్మన్‌గా ఆశన్నగారి జీవన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జోనల్ కన్సల్టెన్సీ కమిటీ సభ్యునిగా నన్నపనేని నరేందర్‌ను నియమించారు. అనంతరం శాసన సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు.
ఇదీ చూడండి: అవసరమైతే ఇంకా అప్పులు తెస్తాం: సీఎం కేసీఆర్