కొవిడ్‌కు ముందులా పూర్తి స్థాయిలో బస్సులన్నీ నడుపుతుండటం, ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య అంతర్‌రాష్ట్ర సర్వీసులను మరిన్ని పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. గతేడాది చేసుకున్న ఒప్పందంకంటే రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని కి.మీ.మేర బస్సులు నడుపుదామంటూ తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ తాజాగా లేఖ రాసింది. ఇప్పటివరకు కొవిడ్ రెండు దశల కారణంగా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పరిమితంగా సర్వీసులు నడిపారు.
2,3 నెలలుగా పూర్తిస్థాయిలో సర్వీసులు నడుపుతున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోంది. దీంతో లాభదాయకంగా ఉండే తెలంగాణకు అంతర్‌రాష్ట్ర సర్వీసులు పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా రెండు ఆర్టీసీలు నిత్యం 2.05 లక్షల కి.మీ.చొప్పున నడిపేందుకు అంగీకరించాలని కోరుతూ ఏపీఎస్‌ఆర్టీసీ లేఖ రాసింది.
ఇవీ చూడండి: