ETV Bharat / state

కొవిడ్​ పరీక్ష చేయించుకున్న ఓవైసీ.. రిపోర్టులో ఏముందంటే..!

హైదరాబాద్​ నిజామియా ఏరియా ఆసుపత్రిలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్ష ఫలితాల్లో నెగిటివ్​ వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు.

Asaduddin Owaisi undergone test for COVID-19
నిజామియా ఆసుపత్రిలో అసదుద్దీన్​ ఓవైసీ కొవిడ్​ పరీక్షలు
author img

By

Published : Jul 11, 2020, 1:40 PM IST

Updated : Jul 11, 2020, 1:46 PM IST

ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ ప్రభుత్వ నిజామియా ఏరియా ఆసుపత్రిలో శనివారం కొవిడ్​-19 నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షా ఫలితాలు నెగెటివ్ వచ్చినట్లు అసదుద్దీన్​ ట్విటర్​లో పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలు టెస్టులు చేయించుకునేలా వారిలో అవగాహన పెంచేందుకు తాను యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నట్లు అసదుద్దీన్​ వివరించారు. పాతబస్తీలో 30కి పైగా ఆంటీజెన్ పరీక్షాకేంద్రాలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి వెనకంజ వేయకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

అనంతరం నిజామియా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాలను ఎంపీ పరిశీలించారు. కొవిడ్​ ప్రభావం రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన కోరారు.

Last Updated : Jul 11, 2020, 1:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.