ETV Bharat / state

'మోదీ ట్వీట్​కు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ - ప్రధాని నిరాశలో ఉన్నారంటూ వ్యాఖ్య' - అసదుద్దీన్ ఓవైసీ తాజా వార్తలు

Asaduddin Owaisi Counter Tweet to Modi Tweet : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. మోదీ కుల గుర్తింపుపై ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ ఓబీసీలకు న్యాయం చేయాలని కోరుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

Asaduddin Owaisi
Asaduddin Owaisi
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 2:10 PM IST

Asaduddin Owaisi Counter Tweet to Modi Tweet : హైదరాబాద్‌కు రావడం ఎల్లప్పుడూ ప్రత్యేకమని.. నగరంలోని లాల్‌బహదూర్ శాస్త్రి స్టేడియానికి తిరిగి రావడం మరింత ప్రత్యేకమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ప్రధాని ట్వీట్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (MIM Chief Asaduddin Owaisi) కౌంటర్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ కుల గుర్తింపుపై ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఓబీసీలకు న్యాయం చేయాలని కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు.

  • PM is appealing for votes on caste identity, but does not want to do justice to OBCs:

    1. Promises to remove reservations for backward Muslims
    2. Did not remove 50% ceiling on reservations
    3. Opposes increasing 27% OBC quota

    When I say that Muslims are underrepresented in… pic.twitter.com/hGcbXZ7QV2

    — Asaduddin Owaisi (@asadowaisi) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ను తొలగించలేదని అసద్దుదీన్ ఒవైసీ ఆరోపించారు. మరోవైపు 27 శాతం ఓబీసీ కోటాను పెంచడాన్ని మోదీ వ్యతిరేకిస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. భారత రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తాను చెప్పినప్పుడు, తనను జాతీయ వ్యతిరేకి, మతవాదని పిలిచారని గుర్తు చేశారు. మోదీ నిరాశలో ఉన్నారని తెలుస్తోందని అసద్దుదీన్ ఒవైసీ ఎద్ధేవా చేశారు.

'దిల్లీ దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా'

BRS Fires on PM Modi Statements in BC Public Meeting : మరోవైపు నరేంద్ర మోదీ (PM Narendra Modi) బీసీ సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నిన్నటి దాకా మత రాజకీయం చేశారని.. ఇక ఇప్పుడు కుల రాజకీయానికి తెర తీశారని ఆరోపించారు. పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో.. బీసీలకు మిగిలింది వేదన మాత్రమేనని అన్నారు. బీసీల జనగణన కూడా చేయని పాలన బీజేపీది అని.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం.. బీజేపీ సర్కార్ అంటూ కేటీఆర్ ఆక్షేపించారు.

KTR Comments on PM Modi : అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయేనని కేటీఆర్ (KTR)పేర్కొన్నారు. బీసీలంటే ఆ పార్టీ దృష్టిలో బలహీనవర్గాలు.. కానీ, తమకు బీసీలంటే బలమైన వర్గాలని ప్రధానిమంత్రికి తెలియదని అన్నారు. రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్​ది అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

'సంపద పెంచాలి- పేదలకు పంచాలనేదే కేసీఆర్ సిద్ధాంతం'

MLC Kavitha Comments on PM Modi : తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బీసీని తొలగించి.. ఓసీకి కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ బీసీ నినాదం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. కేవలం ఎన్నికల కోసమే బీసీ వాదం అందుకున్న బీజేపీ.. బీసీని సీఎం చేస్తామని చెబుతోందని దుయ్యబ్టటారు. బీజేపీ చెప్పుకునే సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ నినాదంలో ఎక్కడా రాష్ట్ర ప్రస్తావన లేదని.. లేదంటే తెలంగాణకు ఐఐఎం, ఐఐటీ, మెడికల్ కాలేజీలు వచ్చేవని కవిత పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మొదలు ప్రతి బీజేపీ నాయకుడు తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడటమే తప్ప.. మనస్పూర్తిగా సహకారం అందించిన సందర్భం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేస్తే అందులోనూ తెలంగాణ ప్రస్తావన లేదని చెప్పారు. ఆ రెండు పార్టీల ఆలోచనలో కనీసం తెలంగాణ లేదని.. అటువంటి పార్టీలు మనకు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని కవిత సూచించారు.

అవినీతిపరులను వదలం - తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం : మోదీ గ్యారెంటీ

ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.