ETV Bharat / state

వనజీవుల కోసం వన్యప్రాణి మండలి - ముఖ్యమంత్రి ఛైర్మన్​గా రాష్ట్ర వన్యప్రాణి మండలి

వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఛైర్మన్​గా, అటవీ శాఖ మంత్రి వైస్​ ఛైర్మన్​గా ఉండి సభ్యులను నియమించారు. ఈ మండలిలో ఎమ్మెల్యేలు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, తదితర ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.

వనజీవుల కోసం వన్యప్రాణి మండలి
వనజీవుల కోసం వన్యప్రాణి మండలి
author img

By

Published : Dec 18, 2019, 7:17 PM IST

వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఛైర్మన్​గా, అటవీ శాఖ మంత్రి వైస్ ఛైర్మన్​గా ఉండే ఈ మండలిలో సభ్యులను నియమించారు. శాసనసభ్యుల కోటాలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులను సభ్యులుగా ఉంటారు.

శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు సభ్యులుగా..

ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్​పర్సన్ కోవా లక్ష్మి, ఎస్టీ ప్రతినిధి బానోతు రవి, ఎన్జీవోల ప్రతినిధులుగా వరల్డ్ వైడ్ ఫండ్ అనిల్ కుమార్, దక్కన్ బర్డ్స్ మూర్తి, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అవినాష్​ విశ్వనాథన్​లను కూడా సభ్యులుగా నియమించారు. శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, సంబంధిత శాఖల అధికారులను కూడా వన్యప్రాణి మండలి సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్ల పాటు సభ్యులుగా కొనసాగుతారు. ఈ మేరకు అటవీ, పర్యావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏటా 2 సార్లు సమావేశం:

బోర్డు ప్రతి ఏటా విధిగా రెండు సార్లు సమావేశం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వన్యప్రాణుల పరిరక్షణ ప్రాంతాలుగా ప్రకటించే ప్రాంతాల ఎంపిక, నిర్వహణ విషయంలో వన్యప్రాణి మండలి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. వన్యప్రాణులు, ప్రత్యేక మొక్కల జాతుల పరిరక్షణ కోసం అవసరమైన విధానాలను రూపొందించాలి. పరిరక్షణ ప్రక్రియలో అటవీప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'

File : TG_Hyd_70_18_Widlife_Board_Dry_3053262 From : Raghu Vardhan ( ) వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఛైర్మన్ గా, అటవీశాఖా మంత్రి వైస్ ఛైర్మన్ గా ఉండే రాష్ట్ర వన్యప్రాణి మండలిలో సభ్యులను నియమించారు. శాసనసభ్యుల కోటాలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులను సభ్యులుగా నియమించారు. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఎస్టీ ప్రతినిధి బానోతు రవి, ఎన్జీఓల ప్రతినిధులుగా వరల్డ్ వైడ్ ఫండ్ అనిల్ కుమార్, దక్కన్ బర్డ్స్ మూర్తి, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అవినాష్ విశ్వనాథన్ లను సభ్యులుగా నియమించారు. శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, సంబంధిత శాఖల అధికారులను కూడా వన్యప్రాణి మండలి సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్ల పాటు సభ్యులుగా కొనసాగుతారు. ఈ మేరకు అటవీ, పర్యావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు ప్రతి ఏటా విధిగా రెండు మార్లు సమావేశం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వన్యప్రాణుల పరిరక్షణ ప్రాంతాలుగా ప్రకటించే ప్రాంతాల ఎంపిక, నిర్వహణ విషయంలో వన్యప్రాణి మండలి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. వన్యప్రాణులు, ప్రత్యేక మొక్కల జాతుల పరిరక్షణ కోసం అవసరమైన విధానాలను రూపొందించాలి. పరిరక్షణ ప్రక్రియలో అటవీప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉంటుంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.