ETV Bharat / state

సీసాల్లో నిర్మాణాలు.. సుద్దముక్కలపై అద్భుతాలు

నిత్య విద్యార్థిగా మారి... విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడానికి తపన పడుతున్నారు ఏపీ నెల్లూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. నైపుణ్యాలు పెంచుకుంటూ.. సృజనాత్మకతను జోడిస్తూ జాతీయ స్థాయి కళాకారుడిగా మారారు. ఎన్నో అద్భుత కళా ఖండాలకు జీవంపోస్తూ... జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అభినందనలు అందుకున్నారు. వ్యర్థాలకు అర్థం చెబుతూ.. చెక్కముక్కలు, గుండుసూదులు, పెన్సిల్ ముక్కలు, సుద్దముక్కలతో అద్భుతాలు సృష్టిస్తూ... చూపరులను కట్టిపడేస్తున్నారు.

సీసాల్లో నిర్మాణాలు.. సుద్దముక్కలపై అద్భుతాలు
సీసాల్లో నిర్మాణాలు.. సుద్దముక్కలపై అద్భుతాలు
author img

By

Published : Dec 2, 2020, 10:34 PM IST

ఏపీ నెల్లూరుకు చెందిన గంధవళ్ల ఉమాశంకర్... ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కళలపై ఆసక్తితో గాజు సీసాల్లో దేవాలయాలు, రథాలు, గుర్రాలు వంటి అనేక రకాల బొమ్మలను తయారుచేసి ఆశ్చర్యపరుస్తున్నారు. సుద్దముక్కలపై జాతీయ నాయకుల బొమ్మలు, పెన్సిల్ మొనలపై సూక్ష్మ చిత్రాలు, పెన్సిల్ గ్రాఫైట్​తో ప్రఖ్యాత ఆలయాల నమూనాలు నిర్మిస్తూ అబ్బురపరుస్తున్నారు.

రావి ఆకులను ఎండపెట్టి.. వాటిని కత్తిరించి ప్రముఖుల చిత్రాలు తయారుచేస్తున్నారు. విద్యార్ధులకు అవగాహన, ఆసక్తి కలిగించేందుకు... బల్బులో ఆదర్శ పాఠశాల నమూనాను రూపొందించారు. వీటితో పాటు గాంధీజీ ప్రతిమ, రాట్నం, వందేమాతరం అనే హిందీ అక్షరాలను తీర్చిదిద్దారు.

పెన్సిల్ లెడ్​తో అద్భుతాలు..

600 పెన్సిళ్ల గ్రాఫైట్​తో ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ నమూనాను తయారు చేశారు. రోజుకు 10 గంటలు కష్టపడి... 60 రోజుల్లో 16సెంటీమీటర్ల వెడల్పు, 38సెంటీమీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఈ నమూనాతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించారు. పెన్సిల్ లెడ్​తో జాతీయ పతాకం, తిరుమల శ్రీవారి ఆలయం, కేదార్​నాథ్ మందిరం, క్రికెట్ ట్రోఫీలు, వినాయకుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, జీసస్ క్రైస్ట్, సచిన్ టెండూల్కర్ తదితరుల చిత్రాలను తయారు చేశారు.

బోన్సాయ్ ప్రత్యేకం...

ఇవేకాక బోన్సాయ్ (మరుగుజ్జు) చెట్లనూ పెంచుతున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా సృజనాత్మకతతో మర్రి, రావి వంటి చెట్లను మరుగుజ్జు చెట్లుగా మార్చి కుండీల్లో పెంచుతున్నారు. ఫలితంగా ఇంటి ఆవరణలో చక్కటి ఉద్యానవన వాతావరణం ఏర్పడింది. ప్రతి ఒక్కరూ... మొక్కలు పెంచాలని సందేశం ఇస్తున్నారు ఉమాశంకర్.

పలు రికార్డులు కైవసం...

కళకోసం తపిస్తున్న ఉమాశంకర్ పలు రికార్డులు సాధించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు. ఆర్​హెచ్ఆర్ వరల్డ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, తమిళనాడు రికార్డు, యూనిక్ వరల్డ్ రికార్డు, వండర్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డు, ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డులు సాధించారు.

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.