అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గోల్నాకలోని ఓ ఆటో మొబైల్ షాప్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్న ఇద్దరు గోడౌన్ వ్యాపారులను అరెస్ట్ చేశారు. రవీందర్, శిశిర అనే నిందితుల నుంచి నకిలీ స్పేర్ పార్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి